Posts

Showing posts from May, 2011

Happy mothers day in Telugu

Happy mothers day in Telugu హ్యాపీ  మదర్స్ డే అమ్మ పాటలు వ్రాసిన మన  తెలుగు కవిదిగ్గజాలకు ఆత్రేయ, సినారె, సిరివెన్నెల, దాశరధి, వేటూరి ఓ అమ్మకు బిడ్డగా నా  పాదాబివందనం - మీ బాలాజీ  - నా ఈ బ్లాగు ప్రపంచములోని  అమ్మలందరికి అంకింతం  ఇమ్ముగఁ జదువని నోరును అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ! అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే — ఆత్రేయ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ — చంద్రబోస్‌ అమ్మను మించి దైవమున్నదా….జగమే పలికే శాశ్వత సత్యమిదే అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు…నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా కంటేనే అమ్మ అని