Happy mothers day in Telugu

Happy mothers day in Telugu

హ్యాపీ  మదర్స్ డే

అమ్మ పాటలు వ్రాసిన మన  తెలుగు కవిదిగ్గజాలకు ఆత్రేయ, సినారె, సిరివెన్నెల, దాశరధి, వేటూరి ఓ అమ్మకు బిడ్డగా నా  పాదాబివందనం - మీ బాలాజీ 

- నా ఈ బ్లాగు ప్రపంచములోని  అమ్మలందరికి అంకింతం 

ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మాయని పిలిచి యన్నమడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!
అమ్మ వంటిది అంత మంచిది అమ్మ ఒక్కటే — ఆత్రేయ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ — చంద్రబోస్‌

అమ్మను మించి దైవమున్నదా….జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే
తప్పటడుగులేసిన చిన నాడు అయ్యో తండ్రి అని గుండె కద్దుకున్నావు…నింగికి నిచ్చెనలేసే మొనగాడినే ఐనా నీ ముంగిట అదే అదే పసివాడినే
కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా రాతి బొమ్మే కదా
కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ప్రతి తల్లికి మమకారం పరమార్ధం మదిలేని అహంకారం వ్యర్ధం వ్యర్ధం —-….–సినారె

ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మ అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా… అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్ళు ఎదిగే బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే… –సిరివెన్నెల


అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియనీ మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లిప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లిసేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా, అది యేనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే, అందరకీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ —దాశరధి


పట్టుపరుపేలనే పండువెన్నెలేలనే అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జోకొట్టునే నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే అమ్మ లాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే —వేటూరి

Comments

Popular posts from this blog

Sri Suguturu Gangamma Jatara Punganur | GANGAMMA JATHARA PUNGANUR

Kamidoddi gangamma jatara in 2016

Top Ten Techie Favorite Areas in Bangalore