శ్రీలంకపై భారత్ జైత్రయాత్ర : మిస్టర్ కూల్ ధోనీ విజయదరహాసం!
శ్రీలంకపై భారత్ జైత్రయాత్ర : మిస్టర్ కూల్ ధోనీ విజయదరహాసం! వెస్టిండీస్ వేదికగా జరిగిన సెల్‌కాన్ ముక్కోణపు టోర్నీలో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోనీ మెరుపులు మెరిపించడంతో శ్రీలంకపై భారత్ క్రికెట్ జట్టు మరోమారు విజయం సాధించి, ట్రై సిరీస్ విజేతగా నిలిచింది. కేవలం ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన తరుణంలో మిస్టర్ కూల్ కెప్టెన్ రెచ్చిపోయి రెండు సిక్స్‌లు ఒక ఫోర్ కొట్టడంతో భారత్ విజయభేరీ మోగించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 48.5 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయింది. లంక ఓపెనర్లు తరంగా (11), జయవర్దనే (22), సంగక్కర (71), థిరమన్నే (46), మ్యాథ్యూస్ (10)లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టెయిల్ ఎండ్ బ్యాట్స్‌మెన్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. ఎక్స్‌ట్రాల రూపంలో 23 పరుగులు లంక స్కోరుకు కలిశాయి. ఆ తర్వాత 202 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఆరంభించారు. ధావన్ (16) ఎరాంగె బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌తో వెనుదిరిగడంతో భారత్ వికెట్ల పతనం ఆరంభమైంది. మరో రెండు ఓవర్లకు రెండు పరుగులు జోడించి కోహ్లీ (2) కూడా ఎరంగా బౌలింగ్‌లోనే సంగక్కర చేతికి ...