vemana padyalu in telugu
అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినర వేమ!
ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
ఫురుషులందు ఫుణ్య పురుషులు వేరయ
విశ్వధాభిరామ, వినుర వేమ
కనక మృగము భువిని కలదు లేదనకను
తరుణి వీడి చనియె దాశరధుడు
బుద్ధిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వధాభిరామ, వినుర వేమ
గంగి గోవు పాలు గరిటడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆత్మశుద్ధి లేని అచారమది ఏల
భాండశుద్ధి లేని పాకమేల
చిత్తశుద్ది లేని శివ పూజలేలర
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆల్పుడెపుడు పల్కు ఆడంబురము గాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచు మోగినట్లు కనకమ్ము మ్రోగునా
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆనగననగ రాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వధాభిరామ, వినుర వేమ
అనువు గాని చోట అధికులమనరాదు
కొంచమైన నదియు కొదవ గాదు
కొండ అద్దమందు కొంచమై ఉండదా
విశ్వధాభిరామ, వినుర వేమ
ఆపదైన వేళ నరసి బంధుల జూడు
భయమువేళ జూడు బంటు తనము
పేదవేళ జూడు పెండ్లము గుణము
విశ్వధాభిరామ, వినుర వేమ
Comments
Post a Comment