The Telugu Language | History of Indian Telugu Language | Telugu Basha Charitra | తెలుగు భాష

Telugu | Telugug Baasha | Telugu History | Telugu Language | Telugu Letters | Telugu Poems



Poems in Telugu | Poems in Telugu Language
Telugu basha padyalu

తెలుగు భాష

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశం లో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో  ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో హిందీ, బెంగాలీ తర్వాత మూడవ స్థానములోను నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది. మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళములతో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు
(అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించారు.

తెలుగు అక్షరమాల

తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు గా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.



తెలుగు అంకెలు (తెలుగు సంఖ్యామానము)
పేరు
తెలుగుసంఖ్య
ఇండో అరబిక్ అంకెలు
సున్నా
0
0
ఒకటి
1
రెండు
2
మూడు
3
నాలుగు
4
ఐదు
5
ఆరు
6
ఏడు
7
ఎనిమిది
8
తొమ్మిది
9

తెలుగు వర్ణమాల

అచ్చులు

























ఉభయాక్షరమలు








హల్లులు












































 






కవిత్రయం


వేదవ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారతాన్ని తెలుగు పద్యకావ్యంగా అనువదించిన ముగ్గురు కవులు తెలుగు సాహితీ చరిత్రలో కవిత్రయం అని మన్ననలందుకొన్నారు.

నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలు తెలుగునాట ప్రసిద్ధి గాంచినకవులు. సంస్కృతంలో వేద వ్యాసుడు రచించిన,పంచమ వేదంగా కీర్తిగాంచిన మహాభారతాన్ని ఈ ముగ్గురు కవులు తెలుగులోకి అనువదించారు. సంస్కృతం నుండి అనువదించినప్పటికీ, తెలుగులో దీనిని స్వతంత్ర 'కావ్యం'గా తీర్చి దిద్దారు.

Telugu Padyalu | Telugu basha gurunchi padyalu

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లనృపులు గొలువ ఎరుగవేబాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స    ” —శ్రీ కృష్ణదేవ రాయలు

“    జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?    ” — వినుకొండ వల్లభరాయడు

“    సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?    ” — మిరియాల రామకృష్ణ

ఉగ్గు పాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకు విందు
దేశభషలందు తెలుగు లెస్స!

సంస్కౄతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమౄతరాశి
కన్నడంబులోని తేట తెలుగు నందు
వేనవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములలో వసిగాంచిన భాష
వేయియే ండ్ల నుండి విలసిల్లు నా 'భాష '
దేశ భాష లందు తెలుగు లెస్స

uggu paala numDi uyyaalaloe numDi
ammapaaTa paaDinaTTi bhaasha
taene vanTi mandu veenulaku vimdu
daeSabhashalamdu telugu lessa!

samskRutambuloeni chakkera paakambu
arava bhaashaloani amRutaraaSi
kannaDambuloeni taeTa telugu namdu
vaenavaela kavula veluguloe ruupomdi
daeSadaeSamulaloe vasigaamchina bhaasha
vaeyiyae mDla numDi vilasillu naa 'bhaasha '
daeSa bhaasha lamdu telugu lessa











Comments

Popular posts from this blog

Sri Suguturu Gangamma Jatara Punganur | GANGAMMA JATHARA PUNGANUR

Kamidoddi gangamma jatara in 2016

Top Ten Techie Favorite Areas in Bangalore